నడుం నొప్పికి కీలకమైన వెన్నుముక నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (back pain) అంటారు. 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యలవల్ల వచ్చే నడుమునొప్పి సర్వసాధారణం. ఎక్కువమందిలో కనిపించేదీ... అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నడుం నొప్పి మాత్రం డిస్కు సమస్యలవల్ల వచ్చే నడుము నొప్పే.
Wellness World
Sunday, October 21, 2012
అధిక బరువుకు చక్కని ఔషధం! (how to get wieght loss)
జీవితాంతం స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండాలని అందరికి ఉంటుంది. అలా ఉండాలంటే తమ జీవన శైలి విధానములో కొద్దిపాటి మార్పులు చేసుకొని, ఆహార నియమాలు పాటిస్తూ, హోమియో మందులు వాడుకొని ‘ఊబకాయం’ సమస్య నుండి బయటపడవచ్చును.
ఈ రోజుల్లో ఊబకాయానికి చాలామంది గురవుతున్నారు. దీనికి గల కారణం మారిన జీవన శైలి విధానమే. నేటి నవీన యుగంలో ఊబకాయాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నారు. క్యాలరీలు ఎక్కువగా ఉన్న స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఆహార పదార్థాలను ఇష్టపడి తినటం వలన లావెక్కుతున్నారు.
లావెక్కడానికి కారణాలు
భోజనానికి భోజనానికి మధ్య విరామము లేకుండా ఏదో ఒకటి తినడం, పిజ్జాలు, కేకులు, శీతల పానీయాలు, ఎక్కువ కేలరీలున్న ఆహారము తీసుకొనడం. శారీరక శ్రమ, వ్యాయామము లేకపోవడం, రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకోవడం. మానసిక స్థితి ప్రభావము శరీరంముపై పడి స్థూలకాయం వచ్చును. కొన్ని రకాల మందులవల్ల కూడా బరువు పెరగవచ్చును. హైపోథైరాయిడిజం, గర్భసంచి సర్జరీ ద్వారా తొలగించడం, హార్మోనుల అసమతుల్యత వలన స్థూలకాయం రావచ్చును.
అధిక బరువు తెచ్చే సమస్యలు
మన బరువే మనకు శత్రువుగా మారుతుందన్న విషయాన్ని చాలామంది గమనించలేకపోతున్నారు. బరువు పెరుగుతుంటే వ్యాధుల జాబితా కూడా పెరిగిపోతున్నది. మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ పెరుగుట, గుండెపోటు, పక్షవాతం, అజీర్ణ సమస్యలు, పిత్తాశయంలో రాళ్లు, అండాశయాల్లో నీటి తిత్తులు (పి.సీ.ఓ.డి.), కీళ్లు అరిగిపోయి- కీళ్లనొప్పులు రావటం, నడుము నొప్పి, సంతాన రాహిత్యం, మానసికంగా కుంగిపోవడం వంటి సమస్యలు స్థూలకాయం వలన వస్తున్నవి.
అధిక బరువు నివారణకు జాగ్రత్తలు
ప్రతిరోజు వ్యాయామము 30 నుండి 45 నిముషాలు చేయాలి. సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. పండ్లు, పచ్చి కూరగాయలలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి. మాంసాహారము, వేపుళ్లు, బేకరి ఫుడ్స్, ఐస్‌క్రీములు, కేకులు, బిర్యాని వంటి ‘జంక్’్ఫడ్స్ను మానివేయాలి. భోజనానికి భోజనానికి మధ్య చిరుతిండ్లను మానివేయాలి. అధికంగా ఉప్పు, స్వీట్లను తీసుకోకూడదు. భోజనంలో ఎక్కువగా పచ్చి కూరగాయలు తీసుకోవాలి. క్యారెట్, కీర, బీట్రూట్ వంటి సలాడ్స్‌ను భోజనంతో తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కాయగూరలు తీసుకోవాలి. యోగ నిత్యం చేయాలి. మంచి గురువు సమక్షంలో అభ్యాసం చేసి యోగ చేస్తే ఉపయోగంగా ఉంటుంది. బరువును ఒక నెలలో రెండు నెలల్లోనే తగ్గాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. సుమారు ఒక సంవత్సరం వరకు ఆహార నియమాలు పాటిస్తూ మంచి జీవన విధానాన్ని అలవరచుకుంటే నిత్యం స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండవచ్చు.
అధిక బరువు అంటే...
కొవ్వు శరీరంలో అవసరానికి మించి, అధికంగా ఉండటాన్ని స్థూలకాయంగా భావిస్తారు. పురుషుల శరీర బరువులో 18 శాతం బరువు, స్ర్తిల శరీర బరువులో 25 శాతం బరువు క్రొవ్వు కారణంగా ఉంటుంది.
మందులు
పైటోలక్కాబెర్రి: బరువు తగ్గుటకు ఈ మందు బాగా పనిచేయును. లావుగా ఉండి కీళ్ళనొప్పులతో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. వీరికి గొంతుకు ఇరువైపుల గ్రంథులు వాసి ఉంటాయి. మింగుట కష్టంగా మారును. వీరికి కీళ్ళనొప్పులు ‘కరెంట్ షాక్’లాగా పోట్లతో కూడి ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును వాడుకొని ఊబకాయమును తగ్గించుకోవచ్చును.
గ్రాఫయిటీస్: వీరు లావుగా ఉండి పొట్ట పెద్దగా ఉంటుంది. వీరు మలబద్ధకంతో, చర్మవ్యాధులతో బాధపడుతుంటారు. వీరి పిరికి మనస్తత్వం, బద్ధకస్తులు ఏ పని చేయటం చేతకాదు. ఏ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు. డోలాయమాన మనస్తత్వం. వీరి శరీరంలో పగుళ్లు ఉంటాయి. కాలి గోళ్లు, చేతి గోళ్లు మందంగా ఉండి ఆకారాన్ని కోల్పోతాయి. ఇటువంటి లక్షణాలు ఉండి లావుగా ఉన్నవారికి ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును.
కాల్కేరియా కార్బ్: వీరు చూడటానికి లావుగా ఉంటారు. వీరి పొట్ట ముందుకు పొడుచుకొనివచ్చి బోర్లించిన మూకుడులాగా ఉంటుంది. తల పెద్దదిగా ఉంటుంది. చూడటానికి లావుగా కనిపిస్తారు కాని ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం ఉండదు. మందకొడితనం, బద్ధకంతో ఉంటారు. వీరికి తలమీద చెమటలు ఎక్కువగా వస్తుండటం గమనించదగిన లక్షణం. వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి శరీరక, మానసిక లక్షణాలున్నవారికి లావు తగ్గించటానికి ‘కాన్షిట్యూషనల్’ మందుగా కాల్కేరియా కార్బ్ బాగా ఉపయోగపడుతుంది.
నక్స్‌వామికా: నేటి ఆధునిక జీవన శైలికి ఈ మందు ప్రత్యేకమైనది. కదలకుండా కూర్చుని పనిచేసి జంక్ఫుడ్స్ ఇష్టపడేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. కాఫీలు, మద్యం, వేపుళ్లు ఎక్కువగా తీసుకోవటానికి ప్రాముఖ్యత ఇస్తారు. తద్వారా ఊబకాయం వీరికి సులువుగా వస్తుంది. వీరు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. వీరికి కోపం ఎక్కువ. చిరుబురులాడే మనస్తత్వం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ముఖ్యమైనది.
ఈ మందులే కాకుండా థైరాయిడిజం, ప్యూకస్ వెస్కులసిస్, కాల్కేరియా ఫ్లోర్, కాలీమోర్, క్యాలోట్రోఫస్, సెపియా వంటి మందులను డాక్టర్ సలహా మేరకు వాడుకొని స్థూలకాయం నుండి విముక్తి పొందవచ్చును.

ఒత్త్తిడిని తట్టుకునేదెలా
ప్రపంచ దేశాలలో మానసిక ఆరోగ్యం ఒక సమస్యగా మారుతున్నది. ఒకప్పుడు అంటువ్యాధులు మనుషుల్ని బలితీసుకున్నాయి. ఇప్పుడు మానసిక మనోశారీరక రుగ్మతలు కృంగదీస్తున్నాయి. ఇందులో డిప్రెషన్ అంత్యంత ప్రమాదకారిగా మారుతున్నది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో 35 కోట్ల మంది డిప్రెషన్తోబాధపడుతన్నారు. ఏటా 10 కోట్లమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడేవారిలో అధిక శాతం డిప్రెషన్ బాధితులన్నది కాదనలేని సత్యం. 2020 నాటికి డిప్రెషన్ ప్రధాన ప్రాణాంతక రుగ్మత కానున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. ప్రపంచంలో 12 శాతం మంది మానసిక రుగ్మతల్ని అనుభవిస్తున్నారు. అనేక శారీరక రుగ్మతలకు మానసిక ఒత్తిళ్ళు, ఇతర మనోజనిత సమస్యలే కారణమని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ప్రపంచ మానసిక వారోత్సవాలలో డిప్రెషన్, ఆత్మహత్యలను అరికట్టడంపై దృష్టి సారించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు.
డిప్రెషన్‌ను ఢీకొట్టవచ్చు
డిప్రెషన్‌ను ఢీకొట్టవచ్చు
మన సమాజంలో మనోవ్యాధి (డిప్రెషన్)కు మందులేదన్న నానుడి ఉంది. అంటే మందులు అవసరం లేదన్న భావన కొందరిలో ఉంటే, మందులు వేసినా ప్రయోజనం లేదన్న నిరాశావాదం మరికొందరు వ్యక్తీకరించేవారు. అయితే ఇప్పుడు డిప్రెషన్‌ను తగ్గించేందుకు చక్కని మందులు, కౌనె్సలింగ్ ప్రక్రియలు, చికిత్సా పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రాథమిక దశలో గుర్తిస్తే డిప్రెషన్‌ను అతి సులభంగా నయం చేయవచ్చు. దృక్పథం, వ్యక్తిత్వ లోపాలవల్ల కృంగుబాటుకు గురయ్యేవారిని కాగ్నెటివ్ బిహేవియర్ థెరపి ఇతర మార్గాల ద్వారా మామూలు మనుషుల్ని చేయవచ్చు. మెదడులో హార్మోన్ల అసమతుల్యతవల్ల తలెత్తే డిప్రెషన్‌కు మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో దీర్ఘకాలం మందులు వాడవలసి వస్తుంది. మందుల వాడకంతోపాటు, కౌనె్సలింగ్, యోగ, ధ్యానం, అభిరుచులు, ఇతర సహాయకారి పద్ధతుల మద్దతుతో త్వరగా తగ్గించవచ్చు. డిప్రెషన్కుగల కారణాలు, లక్షణాలను బట్టి చికిత్సా పద్ధతులను ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రతిరోజు మనకు ఎదురయ్యే మానసిక ఒత్తిడి, దిగులు, అశాంతిని డిప్రెషన్‌గా భావించరాదు. అయితే రెండు వారాల కంటే ఎక్కువ కాలం బాధపడుతుంటే మాత్రం డిప్రెషన్‌గా గుర్తించాలి. డిప్రెషన్ బాధితుల్లో సహజంగా ఆందోళన, నిద్రలేమి, ఆకలి వేయకపోవడం, అపరాధ భావం, ఆత్మదయ, ఆత్మనింద, ఆత్మన్యూనత, ఏకాగ్రత తగ్గడం, నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యా భావన, ఇతర లక్షణాలు కనిపిస్తుంటాయి. వాటి తీవ్రతను బట్టి సాధారణ, ఒక మోస్తరు, తీవ్ర స్థాయి రుగ్మతగా వర్గీకరించి చికిత్స చేస్తారు. డిప్రెషన్‌కు పలు మానసిక, శారీరక, హార్మోన్ల సమస్యలు కారణం కావచ్చు. కొన్ని సందర్భాలలో జన్యుపర అంశాలు డిప్రెషన్‌కు మూలం కావచ్చు. కారణం ఏదైనప్పటికి మందులు, సైకోథరపి, కౌనె్సలింగ్, బిహేవియర్ థెరపి, ఇతర పద్ధతుల ద్వారా తగ్గించవచ్చు. దీనికోసం మానసిక వైద్యులు, మానసిక నిపుణులు, సామాజిక కార్యకర్తల సేవలు ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాటు అవసరం ఉంటుంది. వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు, సమస్యలు పరిష్కరించుకునే శక్తి, ఒత్తిళ్ళ నిర్వహణ లాంటి అంశాలలో మెళకువలు నేర్పించడం కూడా చాలా అవసరం. యోగ, ధ్యానం, క్రీడలు, వ్యాయామాలు, సమతులాహారం, చక్కని అభిరుచులు డిప్రెషన్‌ను దూరం చేయడంలో సహాయకారిగా పనిచేస్తాయి. ఏ ఒక్కరు హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడరు. చాలా రోజులనుంచి ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అప్పులు, అపజయాలు, ప్రేమ వైఫల్యం, ఇతర ఒత్తిళ్ళలో ఏదో ఒక అంశం వారిని దీర్ఘకాలం కృంగదీస్తుంటుంది. ఆత్మహత్యలకు పాల్పడేవారిలో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలతోపాటు మరికొన్ని ప్రవర్తనలు స్పష్టంగా కనిపిస్తాయి. నిరాశావాదనలు, అపరాధభావం ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఆత్మరాహిత్యం, చావు, పుట్టుకలు, కర్మఫలాలను గూర్చి చర్చిస్తుంటారు. ఆత్మహత్యా భావాలను నేరుగా లేదా నర్మగర్భంగా వ్యక్తీకరిస్తుంటారు. డైరీలు, పుస్తకాలలో రాసిపెట్టడం, ఆత్మహత్యకు ఉపయోగించే వస్తువుల సేకరణకు పాల్పడుతుంటారు. ఇలాంటివారిని ముందుగానే గుర్తించి కౌనె్సలిం గ్ చికిత్సలు చేయిస్తే ప్రమాదం నుంచి గట్టెక్కించవచ్చు.
అయితే చాలామంది మానసిక వైద్యులు, నిపుణులను సంప్రదించడం అవమానంగా భావిస్తుంటారు. ఈ భావన పూర్తిగా తప్పు. జ్వరం, తలనొప్పి లాంటి సాధారణ ఆరోగ్యం సమస్యల కోసం డాక్టర్లను కలసినంత సహజంగా సైకియాట్రిస్టు, సైకాలజిస్టులను కలవడం అలవర్చుకోవాలి. బాల్యం నుంచి వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. మానసిక సమస్యలు, రుగ్మతల్ని మొగ్గలోనే తుంచేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ఫూర్తి నెరవేరుతుంది. అలాగే సాధారణ వైద్యులు తమ దగ్గరికి వచ్చేవారిలో మనిషి సమస్యలను గుర్తించి, నిపుణుల వద్దకు పంపాలి. సమాజంలోని అందరు కలిసి డిప్రెషన్ భూతాన్ని ఢీకొట్టాలి. ఆత్మహత్యల్ని అరికట్టేందుకు కృషి చేయాలి.
ఇధి మానితే లాభాలెన్నో
సిగరెట్లను మానేస్తే గుండెపోటు రిస్కును తగ్గించుకోగలుగుతాను
క్యాన్సర్‌కి గురయ్యే రిస్కును తగ్గించుకుంటాను.
నేను శారీరకంగా దృఢంగా ఉంటాను. నా చర్మం యవ్వనంతో తొణికిసలాడుతుంది.
రెండు గంటల్లోనే నా శరీరం నుంచి నికోటిన్ వెళ్లిపోతుంది.
నా పిల్లలకుగాని లేదా నా సోదరులకుగాని నేను ఒక ఉదాహరణగా నిలుస్తాను.
నా ఊపిరితిత్తులు మరమ్మతు చేసుకోవటం మొదలెడతాయి.
నా ఊపిరితిత్తులు లోపల పేరుకుపోయిన తార్ని బయటకు పంపించేస్తాయి.
నామీద నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Friday, October 19, 2012
Subscribe to:
Comments (Atom)